- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!’.. కవిత పార్టీపై బీఆర్ఎస్ కౌంటర్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)పై బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా స్పందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)పై బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా స్పందించింది. ‘ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!’ అంటూ కోల్గేట్, బిస్లరీ ఒరిజినల్, వాటికి సంబంధించిన ఫోక్ ప్రోడక్స్ ఫోటోలను బీఆర్ఎస్ షేర్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని బీఆర్ఎస్ పరోక్షంగా చెప్పింది. ఈ మేరకు కవిత పార్టీ అనౌన్స్ చేసిన కొద్ది సేపటికే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.
ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్..!
ప్రస్తుతం ట్వీట్ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘ఒరిజినల్ బ్రాండ్స్‌కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా (కోల్గేట్, బిస్లరీ) ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు!’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నారు. కాగా,శనివారం ఉదయం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా ప్రకటించారు.






