మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-16 05:57:03  IST  )

మంత్రి కొండా సురేఖ కు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనులను R&B కి ప్రభుత్వం అప్పగించింది.

మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లోకి ఎక్కిన ఆమె.. తాజాగా తన OSD పై తీవ్ర ఆరోపణలు రావడం, నిన్న రాత్రి ఓఎస్డీ సుమంత్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకోవడంతో పాటు సుమంత్‌ను తన కారులో మంత్రి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. తాజా వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనుల (Medaram fair works)ను R&B కి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వెంటనే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను రోడ్లు-భవనాల శాఖ (Roads and Buildings Department)కు అప్పగించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

Read More..

కార్య‌క‌ర్త‌లు అధైర్య‌ప‌డొద్దు, నన్ను అరెస్ట్ చేస్తే ఖండించాలి.. కొండా సుస్మిత సెల్ఫీ వీడియో!

Next Story