- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్యకర్తలు అధైర్యపడొద్దు, నన్ను అరెస్ట్ చేస్తే ఖండించాలి.. కొండా సుస్మిత సెల్ఫీ వీడియో!
మంత్రి కొండా సరేఖ కుమార్తె సుస్మిత బుధవారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వీడియోలో.. మాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెడ్డి వర్గం అంతా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొండా సరేఖ కుమార్తె సుస్మిత బుధవారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వీడియోలో.. మాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెడ్డి వర్గం అంతా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గుండు సుధారాణి ఇతర వరంగల్ నేతలు అంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు.
తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని, పోలీసుల ప్రహారీలో తను ఉన్నానని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని తాము ఎప్పుడూ కార్యకర్తల వెంటనే ఉంటామని, పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించాలని అన్నారు. ఏం తప్పు చేశామో అర్థం కావడంలేదని, కక్ష కట్టి బీసీ నాయకులం అని కుట్ర చేస్తున్నారని చెప్పారు. తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని, కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు. video
Read More..
నాకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు
మా అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా..? కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు






