ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ

by Malleboina Mahesh |   (  Updated:2025-12-10 07:37:03  IST  )

Orders issued for Rs. 1000 crore for OU development

ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్లు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో ఓయూ క్యాంపస్‌లో పర్యటించారు. ఆర్ట్స్ కాలేజీ భవనం (Arts College Building) వద్ద ఏర్పాటు చేసిన "సర్వం సిద్ధం" సభలో ఆయన పాల్గొన్నారు.

వర్సిటీలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ఈ భారీ నిధులను (Huge funding) వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. హాస్టళ్ల ఆధునీకరణ, అకడమిక్ బ్లాక్‌ల నిర్మాణం, ఇతర విద్యార్థి సౌకర్యాలపై సీఎం పర్యటనలో తుది సమీక్ష నిర్వహించారు. రూ. 1000 కోట్ల కేటాయింపుతో ఓయూ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More... CM Revanth Reddy: స్టార్టప్‍లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్.. ఫండింగ్‍పై కీలక ప్రకటన

Next Story