- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: స్టార్టప్‍లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్.. ఫండింగ్‍పై కీలక ప్రకటన
2034 నాటికి హైదరాబాద్ లో కనీసం 100 స్టార్టప్‍లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్‍గా ఎదగడమే కాదని, ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని, అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకో సిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. స్టార్టప్‍ల కోసం తమ ప్రభుత్వం రూ.1,000 కోట్లతో స్టార్టప్ ఫండ్ (Startup Funding) ఏర్పాటు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ టీ హబ్‌లో (Tea Hub) గూగుల్ స్టార్టప్ (Google Startup) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. స్టార్టప్‌లను ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ‘నేను ఫుట్‌బాల్ ఆడతానని.. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం.. పట్టుదలతో సాధన చేయాలి.. ఇది టీమ్ వర్క్.. చివరకు గెలుపు చాలా ముఖ్యం..’ అని అన్నారు. స్టార్టప్స్ కూడా అదే విధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్‌కు అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉందని చెప్పారు.
ఇద్దరి సంకల్పం.. సాకారం
హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌లో గూగుల్ ఒకటని అని సీఎం చెప్పారు. ‘మీరు యువకులు, శక్తివంతులు సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు.. ఈ సందర్భంగా మీకు స్ఫూర్తిని కలిగించే ఒక విషయం చెబుతా.. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు.. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది.. అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని గత రెండు రోజులు, తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు.
కాసేపట్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి (CM Delhi Tour) వెళ్లనున్నారు. అక్కడ గ్లోబల్ సమ్మిట్పై అధిష్టానానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్లో కేంద్రమంత్రులను సైతం కలిసే అవకాశం ఉంది.
Read More... ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ






