- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సుల్లో విచ్చలవిడిగా దోపిడీ
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో ప్రభుత్వం పోలీస్ భద్రత నడుమ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. దీంతో ఇదే ఆదనుగా భావిస్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల వద్ద విచ్చలవిడిగా టికెట్ పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు.

దిశ, కామారెడ్డి : ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో ప్రభుత్వం పోలీస్ భద్రత నడుమ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. దీంతో ఇదే ఆదనుగా భావిస్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల వద్ద విచ్చలవిడిగా టికెట్ పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. రెగ్యులర్ టికెట్ ధర కంటే మించి 15 నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ అది కూడా టికెట్ ఇవ్వడం లేదు. జిల్లాలోని కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరే సుమారు అన్ని రకాల బస్సుల్లో ఇదే పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కండక్టర్లు డ్రైవర్లు ఎలాంటి టిక్కెట్ ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేస్తుండగా.. మరి కొంతమంది మాత్రం టికెట్ రేట్ కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సదరు కండక్టర్ డ్రైవర్లను ప్రయాణికులు నిలదీస్తే నిలదీసిన వారి వద్ద డబ్బులు తీసుకోకుండానే తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇప్పటికే పలువురు ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేయగా అలాంటిది ఏం లేదని దాటవేత సమాధానాలు చెబుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
మగవారికి ఉచిత ప్రయాణం..!
నిన్న మొన్నటి వరకు మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండగా.. ఆర్టీసీ కార్మికుల సమ్మె పుణ్యమా అని మగవారికి కూడా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లభిస్తుంది. మహిళలతో పాటు పురుషులకు కూడా ఎలాంటి టికెట్ తీసుకోకుండానే గత మూడు రోజులుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. దీంతో పురుషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని బస్సుల్లో ఆడవారికి టికెట్
కొన్ని రూట్లలో కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు మహిళల వద్ద కూడా టికెట్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు మహిళా ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే బస్సు ఎక్కండి లేదంటే దిగండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు మహిళలకు ఉచిత ప్రయాణం ఉండగా నేడు ఉచితం లేకుండా టికెట్ డబ్బులు వసూలు చేస్తుండ డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి సిబ్బందికి తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఫ్యామిలీతో వెళ్తే అందరికీ టికెట్
తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ప్రస్తుతం ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు అవగాహన లేమితో అందరికీ టికెట్ కొడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కామారెడ్డి బస్టాండ్ నుంచి గాంధారి మండలం గండిపేట్ గ్రామానికి టికెట్ 60 రూపాయలు ఉండగా ఇందులో ఇద్దరు పురుషులు మరో ఇద్దరు మహిళలు ఉండగా.. నలుగురికి కలిపి 300 రూపాయల టికెట్ చార్జి వసూలు చేశారు. ఒక్కొక్కరికి 15 రూపాయలు ఎక్కువగా తీసుకోగా ఇద్దరు మహిళలు ఉన్నప్పటికీ వారికి ఉచిత టికెట్ కాకుండా 75 రూపాయల టికెట్ చార్జి వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేస్తే పట్టింపు లేని సమాధానం చెప్పినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.






