బస్సు ఆపకపోవడంపై ఆగ్రహం.. వెంబడించి డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-24 10:54:47  IST  )

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పుతో దాడికి దిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విజయవాడ వెళ్లేందుకు పులిగడ్డ బ్రిడ్జి వద్ద సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు వేచి చూశారు...

బస్సు ఆపకపోవడంపై ఆగ్రహం.. వెంబడించి డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) అవనిగడ్డ(Avanigadda)లో ఆర్టీసీ డ్రైవర్‌(Rtc Driver)పై ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పుతో దాడికి దిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విజయవాడ వెళ్లేందుకు పులిగడ్డ బ్రిడ్జి వద్ద సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు వేచి చూశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఆపాల్సిందిగా ఓ మహిళా ప్రయాణికురాలు కోరారు. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళ వెంటనే ఆ బస్సును వెంబడించి ఎక్కారు. వెంటనే డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. బస్సు ఆపకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఆమె డ్రైవర్‌ను నిలదీసింది. ఆవేశంతో తన చెప్పుతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

ఆర్టీసీ బస్సుల్లో విచ్చలవిడిగా దోపిడీ

Next Story