ఇక కొత్త కిక్కు.. నూతన మద్యం పాలసీ విడుదల

by Batti.Sumithra |   (  Updated:2025-10-28 03:08:49  IST  )

ఉమ్మడి జిల్లాలోని 151 నోటిఫైడ్ మద్యం షాపులను సోమవారం రెండు జిల్లాల కలెక్టర్లు డ్రా పద్ధతిలో దరఖాస్తు దారులకు కేటాయించారు.

ఇక కొత్త కిక్కు.. నూతన మద్యం పాలసీ విడుదల
X

ఉమ్మడి జిల్లాలోని 151 నోటిఫైడ్ మద్యం షాపులను సోమవారం రెండు జిల్లాల కలెక్టర్లు డ్రా పద్ధతిలో దరఖాస్తు దారులకు కేటాయించారు. డ్రాలో మద్యం షాపులు దక్కించుకున్న వారిలో అత్యధికంగా పాత వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు మద్యం వ్యాపారంలో కొనసాగుతూ గడించిన అనుభవాన్ని మద్యం దుకాణాలను మళ్లీ మళ్లీ దక్కించుకోవడంలో వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ పద్ధతిలో షాపులు కేటాయించినా, పాత వ్యాపారుడికే సుడి బాగుండటంతో ఈ సారి కూడా మద్యం షాపులు వారికే ఎక్కువగా దక్కాయంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వారికి అదృష్టం బాగుందని అధికారులే అంటున్నారు. 2025 -27 కాలానికి మద్యం షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల్లో పాతవారితో పాటు కొత్తవారు కూడా చాలా మంది అప్లయ్ చేసుకున్నారు. కొత్తవారికి కూడా అక్కడక్కడా షాపులు దక్కాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకుని దాదాపు నెలరోజులుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాపారుల నిరీక్షణ సోమవారంతో ముగిసింది. సోమవారం షాపుల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రాలో షాపులు దక్కించుకున్న వారి వివరాలను, వారికి దక్కిన షాపుల వివరాలను ఎక్సైజ్ అధికారులు మీడియాకు విడుదల చేశారు. షాపులు దక్కించుకున్న వారిలో చాలా మంది ఒక్కొక్కరు దాదాపు నాలుగైదు దరఖాస్తులు నమోదు చేసినట్లు తెలిసింది. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షల దరఖాస్తు ఫీజును చెల్లించిన వ్యాపారులు, ఒకటికి మించి ఒక్కొక్కరు దాదాపు 5 దరఖాస్తులు నమోదు చేయించినట్టు తెలిసింది. ఎవరెన్ని దరఖాస్తులు వేశారనే వివరాలను ఎక్సైజ్ అధికారులు తెలపకపోయినా, పాత వ్యాపారుల్లో చాలామంది 5 కన్నా ఎక్కువ దరఖాస్తు చేసుకున్న వారున్నారని, వారికే ఎక్కువ షాపులకు లైసెన్సు దొరికినట్లు తెలుస్తోంది.

అమ్మకాల్లో జోరు చూపాలి..

వ్యాపారాల్లో అత్యంత క్రేజ్ ఉన్న మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకున్న వారిలో అదృష్టం వరించి షాపులు దక్కిన వారు ఇక పై మద్యం అమ్మకాల్లో జోరు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దరఖాస్తులు వేసే సమయానికే కొత్తవారు వ్యాపారం గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. వారు నేర్చుకున్న విషయాలతో ఇక పై మద్యం అమ్మకాల్లో జోరును పెంచాలని ఆశిస్తున్నారు.

రూ. 3 లక్షల డిపాజిట్ హుష్ కాకీ..

మద్యం షాపులు దక్కించుకున్న వారు సంతోషంగా ఉంటే మద్యం షాపులు రానివారు మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నారు. షాపుల కోసం ప్రభుత్వానికి రూ.3 లక్షల నాన్ రిఫంబడుల్ డబ్బులు పోగొట్టుకున్నవారుమాత్రం చాలా చింతిస్తున్నారు. ఉట్టిపుణ్యాన షాపుల కోసం కట్టిన డబ్బులు నాన్ రిఫండబుల్ డబ్బులు కట్టి షాపుల రాకపోవడంతో తినడానికి కూడా ఆసక్తి కలగడం లేదని వ్యాపారులు అంటున్నారు.

Read More..

మద్యం టెండర్లలో ఆంధ్రా వ్యాపారులదే హవా

Next Story