మద్యం టెండర్లలో ఆంధ్రా వ్యాపారులదే హవా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-28 03:10:00  IST  )

ఖమ్మం జిల్లాలో 116 మద్యం షాపులకు గానూ 4430దరఖాస్తులు రాగా ఎక్సైజ్ శాఖ సోమవారం టెండర్ ప్రక్రియ నిర్వహించింది.

మద్యం టెండర్లలో ఆంధ్రా వ్యాపారులదే హవా
X

దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో 116 మద్యం షాపులకు గానూ 4430దరఖాస్తులు రాగా ఎక్సైజ్ శాఖ సోమవారం టెండర్ ప్రక్రియ నిర్వహించింది. సుమారు 100మంది సిండికేట్‌గా మారి టెండర్లు వేశారని, డ్రా ప్రక్రియలో షాపు ఎవరికి వచ్చినా పాత వ్యాపారులే దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. వైరా నియోజకవర్గంలోని కొణిజర్లలో ఓ మహిళకు షాపు డ్రాలో వస్తే వెంటనే పాత ఆయనే కోటి రూపాయలు ఇచ్చి షాపు దక్కించుకున్నారు. ఇలాగే పలు చోట్ల వేరే వారికి డ్రాలో షాపులు వస్తే.. ఒక్కొక్క షాపునకు రూ. కోటి నుంచి కోటిన్నర వరకు చెల్లించి పాత వారే తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా ఈసారి షాపుల కోసం దరఖాస్తులు చేసిన వారిలో సుమారు 20శాతం అంధ్ర వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తున్నది. వారంతా సత్తుపల్లి, మధిర, నేలకొండపల్లి ప్రాంతాల్లోని షాపులను సిండికేట్‌గా మారి షాపులు దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. ఇక ఖమ్మంలోని షాపులకు బినామీలతో ఒక్కరు సుమారు 10 నుంచి 50 షాపులకు టెండర్లు వేసినట్లు సమాచారం. ఈసారి మద్యం షాపుల టెండర్‌లో మహిళల అధికంగా కనిపించారు.

ఖమ్మం జిల్లాలోని మద్యం షాపుల టెండర్లు ప్రక్రియలో సిండికేట్ అయ్యారు. డ్రా ప్రక్రియలో షాపు ఎవరికి వచ్చిన పాత వ్యాపారస్తులే దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఖమ్మం జిల్లాలోని 116మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. 116మద్యం షాపులకు 4430దరఖాస్తులు వచ్చాయి. ఈ షాపులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని మధిరలోని ఆంధ్ర సరిహద్దు ప్రఉన్న షాపులకు ఆంధ్రా వ్యాపారులు దరఖాస్తు చేశారు. అందరూ సిండికేట్‌గా సుమారు 100మంది కలిసి టెండర్లు వేశారు. ఈ మద్యం షాపులకు ఎక్కువగా ఆంధ్ర వ్యాపారులే దక్కించుకున్నారు. ఖమ్మం నగరంలోని స్టేషన్-1, స్టేషన్-2 పరిధిలో ఉన్న షాపులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. చాలా వరకు ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్న వారే షాపులు దక్కించుకున్నారు. వైరా నియోజకవర్గంలోని కొణిజర్లలో ఓ మహిళకు షాపు డ్రా లో వస్తే వెంటనే పాత ఆయనే కోటి రూపాయలు ఇచ్చి షాపు దక్కించుకున్నారు. ఈసారి మద్యం షాపుల టెండర్‌లో మహిళల అధికంగా కనిపించారు. చాలా మంది మహిళల పేరుతో దరఖాస్తులు చేశారు. ఖమ్మంలోని షాపులకు బినామీలతో టెండర్లు వేశారు‌. ఒక్కరు సుమారు 10 నుంచి 50షాపులకు టెండర్లు వేశారు. అందులో డాక్టర్లు, పోలీస్, ఎక్సైజ్ శాఖ చెందిన ఉద్యోగులు ఉండం కొసమెరుపు.

ఆంధ్ర వ్యాపారులే..

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, నేలకొండపల్లి ప్రాంతాల్లోని షాపులకు ఆంధ్రా వ్యాపారస్తులు ఎక్కువ సంఖ్యలో టెండర్ల హవా కొనసాగింది. టెండర్లలో మహిళల పేరుతో దరఖాస్తులు చేశారు. సత్తుపల్లి, మధిర ప్రాంతంలో చాలా వరకు ఆంధ్ర వ్యాపారులే దక్కించుకున్నారు. ఆంధ్ర నుంచి సిండికేట్‌గా మారి షాపులు దక్కించుకున్నారు. డ్రా ప్రక్రియలో చాలా వరకు ఆంధ్ర వారే కనిపించారు. ఖమ్మం జిల్లాలో 116 మద్యం షాపులకు 4430 దఖాస్తులలో 20శాతం వరకు అంధ్ర నుంచి వ్యాపారులు ఉన్నారు. ఎక్సైజ్ శాఖ మూడు రోజులు గడువు పొడిగింపుతో చాలా వరకు ఆంధ్ర వ్యాపారులు టెండర్లు వేశారు.

పాత వారికే షాపులు..

జిల్లాలోని 116 మద్యం షాపుల్లో గౌడ్స్ -18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 రిజర్వేషన్ కేటగిరీలో కేటాయిస్తే, 76 షాపులు జనరల్ కేటగిరీలో కేటాయించారు. అందులో జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉన్న షాపుల్లో పాత వారే షాపులు దక్కించుకున్నారు. ఈ వేరే వారికి డ్రాలో షాపులు వస్తే వాళ్ల దగ్గర నుంచి కోట్ల రూపాయలు చెల్లించి షాపులు దక్కించుకున్నారు. ఒక్కొక్క షాపునకు రూ కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలికినట్లు సమాచారం. ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్న వారే షాపులు దక్కించుకొని బెల్టు షాపులతో ఆదాయం సమకూర్చుకొని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సారి టెండర్లు ప్రక్రియ లో బినామీలదే హవా కొనసాగింది చెప్పవచ్చు‌. ఈ జిల్లాలో డ్రా ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.

పారదర్శకంగా లాటరీ ప్రక్రియ - కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా జిల్లాలో మద్యం షాపులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం స్థానిక సీక్వెల్ రిసార్ట్స్ లో నిర్వహించిన మద్యం (ఏ4) షాపుల కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలోని 116 మద్యం షాపులకు గాను 4430 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో ప్రతి షాపునకు లక్కీ డ్రా తీసి కేటాయించామన్నారు. షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజు నిర్ణీత రుసుము చెల్లించాలన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వేణుగోపాల్‌రెడ్డి, తిరుపతి, ఎక్సైజ్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More..

ఇక కొత్త కిక్కు.. నూతన మద్యం పాలసీ విడుదల

Next Story