- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లకు పట్టిన పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్‍రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదని సీఎం రేవుంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే పరిస్థితి చూస్తునే ఉన్నామని, భవిష్యత్‍లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిస్థితి కూడా అలాగే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయని అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. భవిష్యత్‍లో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడతారని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్‍సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికేనని వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనన్నారు. 2/3 మెజారిటి వచ్చినంత మాత్రాన అన్నీ చట్టాలు చేయలేం 2/3 మెజారిటీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి తానే రాజునని చట్టం చేసుకుంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయి. తానే రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ఒప్పుకుంటారా? డిక్టేటర్ షిప్ ని ఎవరూ అంగీకరించరన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
చెత్త కుప్పగా మార్చేశారు.. శుభ్రం చేస్తున్నాం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు






