చెత్త కుప్పగా మార్చేశారు.. శుభ్రం చేస్తున్నాం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-18 10:29:26  IST  )

గత పాలకులు రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మార్చేశారని, 15 నెలలుగా ఈ చెత్తను శుభ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు....

చెత్త కుప్పగా మార్చేశారు.. శుభ్రం చేస్తున్నాం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత పాలకులు రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మార్చేశారని, 15 నెలలుగా ఈ చెత్తను శుభ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. నిడదవోలు(Nidadhavolu) సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minsiter Chandrababu Naidu) ప్రసంగించారు. మన ఇల్లు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మనం అంతా శ్రద్ధ వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ నెలా మూడో శనివారం ఒక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర(Clean Andhra — Golden Andhra) కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ వారం జల హారతి- జలధార థీమ్‌(Jala Harathi — Jaladhara Theme)తో కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. వంద రోజుల కార్యాచరణ ద్వారా భూగర్భజలాలు పెంచటంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం సాధిద్దామని పిలుపునిచ్చారు. గత పాలకులు ఎక్కడపడితే అక్కడే చెత్త వదిలేసి భూగర్భ జలాలలను కూడా కలుషితం చేసిందన్నారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గత పాలకులు వదిలేసి వెళ్లారని, ఇప్పటికే 114 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించామని తెలిపారు. ‘‘జూన్ నాటికి వందశాతం చెత్తను సేకరించి వ్యర్ధాలను సంపదగా మారుస్తాం. రూ.603 కోట్లతో ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి సంపదగా దానిని మారుస్తాం. ఇంటింటి నుంచి చెత్త సేకరించి దానిని సర్క్యులర్ ఎకానమీగా మార్చేందుకు స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం ద్వారా ఓడిఎఫ్ ప్లస్ సాధించేలా కృషి చేస్తున్నాం. చెత్తను ఓ సమస్యగా మార్చకుండా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి 7.14 లక్షల కిచెన్ గార్డెన్లు, 1 లక్ష సోక్ పిట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రెయిన్లు కూడా నిర్మించాలని నిర్ణయించాం. చెత్తను విద్యుత్ గా మార్చడానికి వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను కూడా మరో 6 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం 31.33 శాతం మాత్రమే ఉంది. 2030 నాటికి 37 శాతానికి , 2047 నాటికి 50 శాతానికి చేరుకోవాలి. ప్రతీ చోటా పచ్చదనం పెంచేలా ప్రజలు సహకారం అందించాలని కోరుతున్నా. వ్యర్ధాలను రీసైకిలింగ్‌కు పంపించి సర్క్యులర్ ఎకానమీగా మారుస్తాం.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

‘‘రాష్ట్రంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను సూపర్ హిట్ చేసి చూపించాం. తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం 2.0, పెన్షన్ ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం అందిస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు తక్కువగానే ఉన్నాయి. ఆక్వా కల్చర్‌తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. కాలుష్య కారకాలు లేకుండా చర్యలు చేపడతాం. ప్రతీ ఇంటికీ త్వరలోనే సురక్షితమైన తాగునీటిని కూడా అందిస్తాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ముఖ్యమంత్రిగా మరోసారి గోదావరి పుష్కరాలను నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. పోలవరం ప్రాజెక్టు మన తెలుగు జాతికి వరం. గత పాలకులు డయాఫ్రాం వాల్ ను గోదాట్లో కలిపేశారు. కేంద్ర సహకారంతో ఇటీవలే డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అయ్యింది. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం. అమరావతి మనకు శాశ్వత రాజధాని అని చట్టం కూడా పార్లమెంటు చేసింది. ప్రభుత్వంపై విశ్వాసంతోనే పూలింగ్ కోసం రైతులు భూములు ఇచ్చారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి పేదవాళ్లకు కడుపు నిండా తిండిపెట్టటం కూడా ఇష్టం ఉండదు. అందుకే అన్న క్యాంటీన్లను మూసేశారు. స్వచ్ఛంధంగా వచ్చిన వారినీ అడ్డుకున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు పని చేస్తున్నాయి. గొడ్డలి పార్టీకి తెలిసింది విధ్వంసం, నరకటం, చంపడమే. పోస్టర్లకు కూడా జంతు బలి ఇచ్చే పార్టీ అది. గొడ్డలి పార్టీలు, మహిళల అభ్యున్నతికి అడ్డుపడే పార్టీలు మనకెందుకు?.’’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

వాళ్లకు పట్టిన పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్‍రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Next Story