- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'టాక్సిక్' లో బోల్డ్ సీన్లు...రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ హీరోయిన్ ?
'టాక్సిక్' లో బోల్డ్ సీన్లు ఉన్న తరుణంలో ఎన్టీఆర్ హీరోయిన్ రిజెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అచ్చం సందీప్ రెడ్డి వంగా మూవీ తీస్తే ఎలా ఉంటుందో... ఈ 'టాక్సిక్' కూడా అలాగే ఉండేలా కనిపిస్తోంది. పీరియడ్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్... చాలా హాట్ గా ఉన్నాయి. మొదటి సాంగ్ లో కియారా, యష్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. అందులో దాదాపు అన్ని బోల్డ్ సన్నివేశాలే ఉన్నాయి.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ లో తారతో యష్ చిల్ అయ్యాడు. త్వరలోనే మూడో స్థానం కూడా రానుందట. అయితే ఈ థర్డ్ సాంగ్ కోసం రుక్మిణి వసంత్ ను అడగగా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పడంతో ఆమె వదులుకున్నారట. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర మాత్రం చాలా కీలకం. దీంతో హుమా ఖురేషితో మూడో సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శకురాలు గీతూ. అటు నయనతార ఈ సినిమాలో హీరో యష్ కు సోదరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.






