తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది : మహేశ్వర్​రెడ్డి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-03 15:15:37  IST  )

తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది : మహేశ్వర్​రెడ్డి
X
  • దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పార్టీ కి ఎనలేని ఆదరణ

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ప్రధాని మోడీ మూడోసారి అధికారి చేపట్టిన తరువాత తొలిసారిగా అడుగుపెడుతున్నారని, దేశ వ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్రను తెలంగాణలో విస్తరింపజేసి సుపరిపాలన అందించడమే ఆయన ఆశయమని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఢీల్లీ, బీహార్, హర్యానా, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో కూడా కమలం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదే క్రమంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడించారు. గత 12 ఏళ్ల మోడీ పాలనలో తెలంగాణ అభివృద్ధికి రూ. 12 లక్షల కోట్లు కేటాయించిందని, రాష్ట్రంలో అధికారంలో లేకపోయిన ఇక్కడ ప్రజల కోసం పూర్తి సహాకారం అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్​పార్టీ మాదిరిగా కేవలం ధనవంతులకే ప్రాధాన్యత ఇచ్చే హైబ్రిడ్​మోడల్​విధానం బీజేపీది కాదన్నారు. ఒకప్పడు తమపార్టీ ఉనికి ప్రశ్నించిన పార్టీలు నేడు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితమయ్యాయని, బీజేపీ బలం పెరగడం చూసి పాలకులు భయపడతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కమలం ఎవరితోను పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈపర్యటనలో భాగంగా మోడీ రూ. 7500 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఈనెల 10న జరిగే సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.

Next Story