- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nampally fire accident: చిక్కుల్లో ఆగురురి ప్రాణాలు.. రంగంలోకి రోబో ఫైర్ మిషన్
నాంపల్లి అగ్నిప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Nampally fire Accident) సంభవించింది. స్టేషన్ రోడ్డులోని బచ్చాస్ క్యాస్టిల్ ఫర్నీచర్ షాప్ లో మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తులు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‍లో తొలుత మంటలు అంటుకుని నిమిషాల్లోనే భవనం అంతటికి వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 8 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫర్నిచర్ షాప్ మొత్తం దట్టంగా పొగ కమ్ముకోవడంతో పాటు షాప్ లోపెద్దమొత్తంలో గ్లాస్, రేకులు ఉండటం సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. భవనంలో ఆరుగురు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. భవనంలో వేగంగా వ్యాపిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆ పరిసర ప్రాంతవాసులను ఖాళీ చేయిస్తున్నారు.
రంగంలోకి రోబో ఫైర్ మిషన్:
ప్రస్తుతం పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృదాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా అగ్నీకీలలు, దట్టమైన పొగ, కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందకు వీలుకావడం లేదు. దీంతో రోబో ఫైర్ మిషన్‍ను (Robot fire machine) అధికారులు రంగంలోకి దింపారు. ప్రస్తుతం రెస్కూయ ఆపరేషన్ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న సిటీ సీపీ సజ్జనార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయ చర్యలు పరిశీలించారు.






