కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఓజో ఫౌండేషన్ చైర్మన్

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-26 12:31:42  IST  )

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఓజో ఫౌండేషన్ చైర్మన్
X

దిశ, హుజూర్ నగర్: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇటీవల ఆయన పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి ఆదివారం ముహూర్తం ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గతంలో ఓజో ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి తనకంటూ అనుచరులను అభిమానులను ఏర్పాటు చేసుకున్నారు.

తనకున్న అనుచరులను అభిమానులను అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులను భారీగా వాహనాల్లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలివెళ్లి కేటీఆర్ జగదీశ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. అధిష్టాన నిర్ణయం వారి సూచనలు సలహాలు మేరకే పని చేస్తానని అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగులు లింగ యాదవ్ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

యాంకర్లు కూడా గుర్తు పట్టని సీఎం రేవంత్ రెడ్డి!" - కేటీఆర్ సెటైర్ల వర్షం

Next Story