యాంకర్లు కూడా గుర్తు పట్టని సీఎం రేవంత్ రెడ్డి!" - కేటీఆర్ సెటైర్ల వర్షం

by Malleboina Mahesh |   (  Updated:2026-04-26 12:30:55  IST  )

కాంగ్రెస్‌లో కమల్ హాసన్ కంటే గొప్ప నటులున్నారని, రంగుల సినిమా చూపి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌ను యాంకర్లు కూడా గుర్తుపట్టడం లేదని ఎద్దేవా చేశారు.

యాంకర్లు కూడా గుర్తు పట్టని సీఎం రేవంత్ రెడ్డి! - కేటీఆర్ సెటైర్ల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీలో పిల్లుట్ల రఘు చేరిక సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రజలకు రంగుల సినిమా చూపించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కమల్ హాసన్ కంటే గొప్ప నటులు ఉన్నారని, వారి నటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు, నాలుగు ఫీట్ల ఎత్తు ఉన్న వారు కూడా నేడు కేసీఆర్ వంటి మహోన్నత నాయకుడిని దూషిస్తున్నారని, ఇది దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల్లో కనీస గుర్తింపు లేదని కేటీఆర్ విమర్శించారు. రీసెంట్‌గా ఒక రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్న యాంకర్లు కూడా గుర్తుపట్టలేకపోయారని, ఇది ఆయన పాలన తీరుకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే ప్రజలు ముఖం తిప్పుకుంటున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కేవలం అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఓజో ఫౌండేషన్ చైర్మన్

Next Story