ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో వాహనం

by Kodari Anjali |   (  Updated:2026-06-18 05:49:28  IST  )

అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో వాహనం
X

దిశ, నల్లగొండ క్రైం: అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి వద్ద గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ లారీ ఇటుకలు లోడ్ తో వచ్చి చర్లపల్లి వద్ద స్మశాన వాటిక ఆవరణలో నల్లగొండ వైపు వచ్చేలేన్ లో పక్కకు ఆపి కూలీలు ఆన్ లోడ్ చేస్తున్నారు. అదే సమయంలో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పగిలిపోయి కుడి సైడ్ దూసుకుపోయి రోడ్డుకింద బోల్తాకొట్టింది. ఈ క్షణాల వ్యవధిలోనే నార్కెట్ పల్లి వైపు నుంచి కూల్ డ్రిక్స్ లోడుతో వస్తున్న మినీ డీసీఎం ఆన్ లోడ్ చేస్తున్న ఇటుకల లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ డీసీఎం క్యాబీన్ నుజ్జయింది. ఈ మూడు వాహనాలకు ఒక్కసారి ప్రమాదం జరిగినా కూలీలకు స్వల్పగాయాలే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లోయలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి..

Next Story