- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది మొక్కబడి కార్యక్రమం కాదు... హైదరాబాద్‍ను తీర్చిదిద్దే యజ్ఞం: సీఎం రేవంత్ రెడ్డి
గుర్రంగూడ వనమహోత్సవంలో భాగంగా హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం పిలుపునిచ్చారు. అటవీ భూముల రక్షణే ధ్యేయమన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వనమహోత్సవం మొక్కుబడి కార్యక్రమం కాదని పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‍ను తీర్చిదిద్దే యజ్ఞం అన్నారు. మొక్కవోని దీక్షతో నిన్నటి విధ్వంస జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పం అన్నారు. ఇవాళ గుర్రంగూడలో ప్రారంభించే వనమహోత్సవం నేపథ్యంలో ఎక్స్ లో పోస్టు చేసిన సీఎం.. వనమహోత్సవంకు ఒక ప్రాధాన్యత ఉందన్నారు. 'చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా… ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం…. ఇదీ గత పాలనా దృశ్యం అయితే చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే యజ్ఞం… ఇది నేటి పాలన దృశ్యం' అన్నారు. 2021 లో ఇదే గుర్రంగూడలో వరదల సమయంలో మల్కాజిగిరి ఎంపీగా పర్యటించినప్పుడు నా మదిలో కలిగిన ఆవేదన నుండి పుట్టిన ఆలోచనకు ఆచరణ ఈనాటి గుర్రంగూడ అటవీ భూమిలో జరిగే వనమహోత్సవం అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కబ్జాదారులపై న్యాయపోరాటం చేసి, అటవీ భూములను రక్షించి, నగరాన్ని వనంలో జనం జీవించే ప్రాంతంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి ఈరోజు నిర్వహించే గుర్రంగూడ వనమహోత్సవం ఒక ఉదాహరణగా అభివర్ణించారు.






