అబ్బాయిగా వెళ్లి అమ్మాయిగా వ‌చ్చాడు.. మోసాల‌తో కోట్లకు పడగెత్తాడు

by Ajay Maddhiboyina |

అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతూ కోట్లు దోచుకుంటున్న ఉదంతం ఏపీలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని శివాజీనగర్‌కు చెందిన మోహన కృష్ణ అనే వ్య‌క్తి కొన్నేళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి అమ్మాయిగా మారి ఇంటికి తిరిగివ‌చ్చింది.

అబ్బాయిగా వెళ్లి అమ్మాయిగా వ‌చ్చాడు.. మోసాల‌తో కోట్లకు పడగెత్తాడు
X

దిశ, వెబ్ డెస్క్: అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతూ కోట్లు దోచుకుంటున్న ఉదంతం ఏపీలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని శివాజీనగర్‌కు చెందిన మోహన కృష్ణ అనే వ్య‌క్తి కొన్నేళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి అమ్మాయిగా మారి ఇంటికి తిరిగివ‌చ్చింది. వచ్చిన తరవాత ఖాళీగా ఉండకుండా అడ్డదారిలో డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం ఒకటి రెండు కాదు అనేక మోసాలకు తెరలేపింది. మధు శ్రీగా పేరు మార్చుకుని చీరకట్టుతో అందంగా రెడీ అవుతూ మగాళ్లకు వలపు వల విసిరి కొందరిని మోసం చేస్తే, పూజలు, గుప్త నిధుల పేరుతో మరికొందరిని మోసం చేసింది.

మీ ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయి వాటిని పోగొడతానంటూ మరికొందరి వద్ద డబ్బులు వసూలు చేసింది. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా మధుశ్రీ వద్దకు వస్తూ అమాయక ప్రజలు మోసపోతున్నారు. అంతే కాదు ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని పెళ్లిళ్లకు వెళ్లడం, జంటలకు దిష్టి తీసిన తరవాత డబ్బులు డిమాండ్ చేయడం కూడా మధుశ్రీకి డబ్బులు దోచే మరో మార్గం. డబ్బులు ఇస్తే సరి లేదంటే బూతులు తిట్టడం, శపించడం చేస్తూ పెళ్లింట ప్రశాంతత లేకుండా చేస్తుంది.

ఎవరైనా ఎదురుతిరిగితే తన వెనుక పోలీసులు, రాజకీయనాయకులు ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడుతుంది. మధు శ్రీ ఇప్పటికే ఇలా కోట్లు సంపాదించిందని అనే ఆరోపణలు ఉన్నాయి. మధుశ్రీ చేతిలో మోసపోయిన కొన్ని కుటుంబాలు మీడియా ముందుకు రావడంతో అసలు బాగోతం బయటపడింది. దాదాపు 13 కుటుంబాలు ఆమె మత్తులో ఉన్నాయని, వాళ్లను మోసం చేస్తూ లక్షలు దోచేసింది అంటూ ఓ బాధిత మహిళ మీడియా ముందు ఆరోపించింది. కానీ వాళ్లు మధుశ్రీకి బయపడి బయటకు రావడంలేదని చెప్పింది. మధుశ్రీ మోసాలపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story