- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలులో రెచ్చిపోయిన అల్లరి మూక.. వైసీపీ పనేనా?
కర్నూల్ జిల్లాలో నిన్న అర్థరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో నిన్న అర్థరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్త అయిన తైజుమ్ బాషా అనే యువకుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చచ్చేలా కొట్టడంతో అతను స్పాట్ లోనే స్పృహ కోల్పోయాడు. బాషాను గాయాలతో చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తన ఇంటి నుంచి కిరాణాషాపుకు వెళ్లి.. తిరిగి వస్తున్న దారిలో దుండగులు కాపుకాశారు. అదనుచూసి చావబాది, హత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జలీల్, ఫైజల్, ఆరిఫ్ అనే యువకులతో పాటు.. దాడిచేసిన వారిలో మరికొందరు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. వీరంతా వైసీపీ కార్యకర్తలుగా చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల సవరణలో వైసీపీ తప్పుల్ని తైజుమ్ కనిపెట్టి అధికారులకు చెప్తుండటంతోనే అతనిపై దాడిచేసినట్లు సమాచారం. అతను టీడీపీకి సపోర్టు చేస్తుండటంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తైజుమ్ కుటుంబీకులు వెల్లడించారు.






