- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
27 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్క చాన్స్ కూడా రాలేదు.. బాలీవుడ్ ఎంట్రీపై జ్యోతిక షాకింగ్ కామెంట్స్
నా 27 ఏళ్ల సుదీర్ఘ సినిమా జీవితంలో నాకు ఒక్క హిందీ సినిమా అవకాశం కూడా రాలేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్, సూర్య భార్యగా ఇండస్ట్రీలో రాణిస్తున్న జ్యోతిక ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘సిస్టమ్’ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం జ్యోతిక చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేనప్పటికీ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా, జ్యోతిక బాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను అస్సలు హిందీ చిత్రపరిశ్రమలో నటించాలని ముందే ప్లాన్ చేసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
"నా 27 ఏళ్ల సుదీర్ఘ సినిమా జీవితంలో నాకు ఒక్క హిందీ సినిమా అవకాశం కూడా రాలేదు. కానీ, నేను ఎప్పుడైతే ముంబైకి మారానో.. ఆ తర్వాతే బాలీవుడ్ నుండి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి" అని చెప్పారు. తాను ముంబైకి మారడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించారు. "నేను హిందీ సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ముంబైకి వెళ్ళలేదు. కేవలం నా పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం.. అలాగే ముంబైలో ఉంటున్న నా తల్లిదండ్రుల కోసం మాత్రమే మేము అక్కడికి షిఫ్ట్ అయ్యాను. బాలీవుడ్ సినిమాల్లోకి రావాలని నేను అస్సలు అనుకోలేదు, అది అనుకోకుండా జరిగిపోయింది. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోవడం, రెండు పరిశ్రమలు కలవడం వల్లే నాకు ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని నేను భావిస్తున్నాను" అని జ్యోతిక వెల్లడించారు.






