- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kamalini Mukherjee: అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు
'గోవిందుడు అందరివాడేలే'లో అనేక సన్నివేశాలు ఎడిటింగ్‌లో తొలగించడంతో బాధపడినట్లు కమలిని ముఖర్జీ చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి కమలిని ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఆనంద్, గోదావరి వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ తెలుగులో చివరిసారిగా రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలై చాలా కాలం అయింది. అయితే ఆ తర్వాత కమలిని ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమలిని, తాను ఎందుకు తెలుగు సినిమాలు చేయడం లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ, "నేను ఇప్పటివరకు ఎన్నో బలమైన, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాను. ప్రేక్షకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. కొన్ని సంవత్సరాల క్రితం గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా గొప్పగా ఉంటుందని భావించాను. కానీ ఎడిటింగ్ సమయంలో నా పాత్రకు సంబంధించిన అనేక సన్నివేశాలు తొలగించబడ్డాయి. దాంతో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది. అందుకే ఆ తర్వాత నుంచి తెలుగు సినిమాల్లో నటించలేదు" అని చెప్పుకొచ్చింది.






