అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి..

by Kodari Anjali |   (  Updated:2026-06-18 05:52:15  IST  )

అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి చెందిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కోసార గ్రామ పంచాయతీ పరిధిలోని భవానీనగర్‌లో జరిగింది.

అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి..
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కోసార గ్రామ పంచాయతీ పరిధిలోని భవానీనగర్‌లో బానోత్ రాజు నాయక్ అతని భార్య సునీత నాయక్ అనుమానాస్పద స్థితిలో మరణించి ఘటనా గురువారం జిల్లాలో కలకలం రేపింది. వీరి కుటుంబం వ్యవసాయ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోని సవారి బంగ్లా వద్ద పూజలు నిర్వహించి తమ ఇంట్లో వరండాలో భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారు. ఇకవేకువజామున మనవరాలు నిద్రనుంచి లేచి ఏడవడంతో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని కుటుంబీకులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇది హత్యా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యానే అని ఆరోపిస్తున్నారు. గత సంవత్సరంలో సవారి ఏర్పాటు విషయంలో బంగ్లా వద్ద గ్రామంలోని ఓ వ్యక్తితో రాజు నాయక్ కు గొడవ జరిగిందని.. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన.. అప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అదే కారణంతో వారిని హత్య చేశారని, ఈ విషయాన్ని పోలిసుల ఫిర్యాదులో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విద్యుత్ షాక్‌తో కూలి మృతి..!

Next Story