ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

by Kodari Anjali |

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
X

దిశ, తుర్కయంజాల్: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం ఇంజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంజాపూర్ వాసులు, తెలంగాణ రెడ్డి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొక్క భూపాల్ రెడ్డి సహకారంతో నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. విద్యతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చని సూచించారు.

మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు..

విద్యాసంస్థలు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే కేంద్రాలుగా మారాలని పేర్కొన్నారు. పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు చేయడం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, విద్యాభివృద్ధికి సహకరిస్తున్న దాతలను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ గండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, ఆదిభట్ల సర్కిల్ డీసీ సత్యనారాయణ రెడ్డి, ఎంఈఓ జగదీష్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు కోశిక ఐలయ్య, తుర్కయంజాల్ డివిజన్ అధ్యక్షులు ఓర్సు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ లు బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి, కాకుమాను సునీల్, మేతరి దర్శన్, నారని శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, నోముల కృష్ణ, సామ భీమ్ రెడ్డి, బొక్క వంశీధర్ రెడ్డి, రెవెల్ల యాదగిరి, కొంతం వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story