- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు.. మాస్కోలో విమానాశ్రయాల మూసివేత
మెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిందనే లోపే రష్యాపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో భీకర దాడులకు దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని, ఈ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని సంబరపడుతున్న ప్రపంచ దేశాలకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త టెన్షన్ పెట్టిస్తోంది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ మరోసారి విరుచుకుపడటం ఆందోళన కలిగిస్తోంది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్ వందలాది లాంగ్ రేంజ్ డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. రష్యాలోనే 9వ అతిపెద్దదైన మాస్కో చమురు శుద్ధి కర్మాగారం (ఆయిల్ రిఫైనరీ)పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో అక్కడ భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ చెలరేగాయి. ఒకే వారంలో ఈ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది రెండోసారి.
ఊపిరి పీల్చుకోనివ్వని యుద్ధాలు:
మాస్కోలోని ఆగ్నేయ ప్రాంతమైన కపోత్న్యాలో ఉన్న కీలక ఆయిల్ రిఫైనరీని ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నారు. గత మంగళవారం నాటి మొదటి దాడితోనే ఈ రిఫైనరీలో కార్యకలాపాలు నిలిచిపోగా.. తాజా దాడి రష్యా ఇంధన రంగాన్ని మరింత దెబ్బతీసింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న రష్యా ఈ దాడుల వల్ల దేశంలో ఏర్పడిన పెట్రోల్ కొరతను అధిగమించడానికి ఈ నెలలో సముద్ర మార్గం ద్వారా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం భారత్ సహా ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభానికి గురి చేయగా తాజాగా మాస్కో రిఫైనరీపై డ్రోన్ల దాడి ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తోంది. ఒక యుద్ధం ముగిసిందని ఊపిరి పూల్చుకుందామనుకునే లోపే రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ముదరడం టెన్షన్ గా మారింది.
మాస్కోలో విమానాశ్రయాల మూసివేత:
ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా అప్రమత్తం అయింది. మాస్కోలో విమానాశ్రయాలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్ వైపు నుంచి దూసుకువచ్చిన దాదాపు180 డ్రోన్లను మాస్కో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 500 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా అధికారుల వెల్లడించారు.






