BVS Ravi: ఆ సినిమా ఫ్లాప్ అని ఎడిటర్ ముందే చెప్పాడు.. ఆ విషయంలో తప్పంతా నాదే

by Pulgam srinivas |

'థాంక్యూ' సినిమా ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం నేను రాసిన కథేనని బివిఎస్ రవి అంగీకరించారు.

BVS Ravi: ఆ సినిమా ఫ్లాప్ అని ఎడిటర్ ముందే చెప్పాడు.. ఆ విషయంలో తప్పంతా నాదే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కథా రచయిత, దర్శకుడు బివిఎస్ రవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలకు కథలను అందించిన ఆయన, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. నాగచైతన్య హీరోగా, విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ చిత్రానికి కూడా రవినే కథ అందించారు. అయితే మంచి అంచనాల మధ్య విడుదలైన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై బివిఎస్ రవి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "సినిమా విడుదలకు ముందే ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని సాధించకపోవచ్చని చెప్పారు.

రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే ఆ విషయం మాకు కూడా అర్థమైంది" అని తెలిపారు. అలాగే విక్రమ్ కె. కుమార్‌ను దేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా పేర్కొన్న రవి, "ఆయన సాధారణంగా ఫెయిల్యూర్‌ను ఎదుర్కొనే దర్శకుడు కాదు. అలాంటి దర్శకుడి సినిమా ఫెయిల్ అయిందంటే, అది నేను అందించిన కథలో జరిగిన తప్పిదం వల్లేనని భావిస్తున్నాను" అని నిజాయితీగా ఒప్పుకున్నారు. తన వల్ల జరిగిన పొరపాటును ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా అంగీకరించిన బివిఎస్ రవి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తప్పును ఇతరులపై నెట్టకుండా బాధ్యతను స్వీకరించడం చాలా అరుదైన విషయం అంటూ పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు.

Next Story