- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. వివిధ కారణాలతో 7600 మంది రైతులు మరణిస్తే వాళ్లకు రావాల్సిన ఇన్స్యూరెన్స్ డబ్బులు ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. వివిధ కారణాలతో 7600 మంది రైతులు మరణిస్తే వాళ్లకు రావాల్సిన ఇన్స్యూరెన్స్ డబ్బులు ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోవడం వల్లనే రైతులకు బీమా డబ్బులు రాలేదని వార్తలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారని విమర్శించారు.
ఇది కేసీఆర్ తీసుకువచ్చిన పథకం కాబట్టి దీనిని ఎలా కనుమరుగు చేయాలనే కుట్ర రేవంత్ ప్రభుత్వం చేస్తున్నట్టు ఉందని మండిపడ్డారు. వీలైతే కొత్త పథకాలు అమలు చేయాలి కానీ గతంలో ఉన్న పథకాలను కూడా కనుమరుగయ్యేలా చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బోనస్ ఇస్తామంటున్న 7 రకాల వడ్ల వల్ల రైతులు ఎకరానికి 10 క్వింటాళ్లు నష్టపోతారని అన్నారు. అంటే ఒక్కో రైతుకు రూ. 24 వేల దిగుబడి తగ్గే అవకాశం ఉందని తెలిపారు. 33 రకాల వడ్లలో ప్రభుత్వం గుర్తిస్తున్న 7 రకాల వడ్లు ఎకరాకి 20 క్వింటాళ్లు పండితే మిగతా 26 రకాలు మాత్రం ఎకరాకు 30 క్వింటాళ్లు పండుతాయని చెప్పారు. ఈ 7 రకాల వడ్లు పండించడం వల్ల రైతులు 10 క్వింటాళ్లు ఎక్కువ నష్టపోతారని తెలిపారు.






