AP : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-18 07:02:22  IST  )

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు.

AP : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో ఫస్టియర్ కు చెందిన 1,59,435 (59%) మంది విద్యార్థులు బెటర్ మార్కులు సాధించారని పేర్కొన్నారు. అలాగే 42,379 (39%) మంది విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. సెకండియర్ కు చెందిన విద్యార్థుల్లో 48,149 (53%) మంది విద్యార్థులు బెటర్ మార్కులు సాధించగా.. 57,327 (56%) మంది విద్యార్థులు సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో పాసవ్వని విద్యార్థులు వచ్చే ఏడాది పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు.

ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకూ బోర్డు.. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ నిర్వహించింది. కేవలం పరీక్షలు ఫెయిల్ అయినవారే కాకుండా, మార్కుల ఇంప్రూవ్ మెంట్ కావాలనుకునే విద్యార్థులకూ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం కల్పించింది బోర్డు. విద్యార్థులు తమ ఫలితాలను http://resultsbie.ap.gov.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని సూచించింది. లేదా 9552300009 నంబర్ కు Hi అని మెసేజ్ చేస్తే ఫలితాలు నేరుగా వాట్సాప్ కు వస్తాయని అధికారులు వెల్లడించారు.

2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం 10,57,312 మంది విద్యార్థులు ఇంటర్ మెయిన్ పరీక్షలు రాయగా.. వారిలో 5,31,171 మంది విద్యార్థులు ఫస్టియర్, 5,26,141 మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఫస్టియర్లో 77 శాతం, సెకండియర్ లో 81 శాతం విద్యార్థులు పాసయ్యారు.

Next Story