- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి..
బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

దిశ, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రెజ్జా కారు (TS08JL8300), కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ (TG05T9635) ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ప్రమాదంలో బ్రెజ్జా కారును నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రేఖ, కుమారుడు లోహిత్ (7), రేఖ సోదరి కుమారుడు నిహాల్ (2)లను స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎముకలకు తీవ్ర గాయాలైన లోహిత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.






