మండేపల్లి మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ పోస్టులు..

by Kodari Anjali |

తంగళ్లపల్లి మండలం మండెపల్లి మోడల్ స్కూల్ లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రకటనలో తెలిపారు.

మండేపల్లి మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ పోస్టులు..
X

దిశ, తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం మండెపల్లి మోడల్ స్కూల్ లో తాత్కాలిక ప్రాతిపదికన పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ తెలుగు, టీజీటీ హిందీ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మామిల్ల విఠల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. పీజీటీ మ్యాథమెటిక్స్‌కు ఎంఎస్సీ, బీఎడ్, పీజీటీ తెలుగుకు ఎంఏ, బీఎడ్, టీజీటీ హిందీకి ఎంఏ, బీఏ హిందీ, హెచ్‌పీటీ, టెట్ అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పీజీటీ అభ్యర్థులు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు బోధించగల అర్హత, సామర్థ్యం కలిగి ఉండాలన్నారు. టీజీటీ హిందీలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధించగల అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో జూన్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 23న డెమో తరగతులు నిర్వహిస్తామని, మరిన్ని వివరాల కోసం 9985920001 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Next Story