విసురు రాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసిన భార్య..

by Kodari Anjali |

విసురు రాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసిన ఘటన గూడూరు మండలం సొమ్ల తండాలో జరిగింది.

విసురు రాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసిన భార్య..
X

దిశ, గూడూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజవతి రాంసింగ్ తండా సమీపంలోని సొమ్ల తండాలో చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బోడ లాలు విజయ దంపతులకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని లాలు భార్య విజయ తండాలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంది. లాలు హైదరాబాదులో కారు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం తండాలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన లాలు అనంతరం ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. భర్త ప్రవర్తనపై విసుకు చెందిన భార్య కోపంతో విసురు రాయితో తలపై కొట్టి హత్య చేసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఆసుపత్రికి తరలించారు.

Next Story