పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన!

by Naga Rani Yarlagadda |

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.

పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా - ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో భారత్ లో గత నెలలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తూ.. కేంద్రం ఎప్పుడెప్పుడు ప్రకటన చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా జరుగుతోంది. తాజాగా ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి సురేష్ గోపి కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినంత మాత్రానద దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించలేమని ఆయనస్పష్టం చేశారు. ముడిచమురు సరఫరా పరిస్థితుల్ని సమీక్షించాకే ఇంధన ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చమురు కొనుగోలు, రవాణా, నిల్వలు, శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతుందని తెలిపారు. దేశంలో ముడిచమురు లభ్యత, సరఫరా పరిస్థితుల్ని కేంద్రపెట్రోలియం శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన సమయంలో ధరలపై కచ్చితంగా సమీక్ష చేస్తామన్నారు. అయితే.. ఇంధన ధరల నిర్ణయం కేవలం అంతర్జాతీయ ముడిచమురు ధరలతోనే ముడిపడి ఉండదని, విదేశీ మారకం విలువ, పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా పరిగణలోకి వస్తాయన్నారు.

Next Story