లోయలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు దుర్మరణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-18 05:48:44  IST  )

లోయలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తోన్న మహీంద్రా బొలెరో వాహనం.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. మస్రూండ్ - హమాల్ మార్గంలోని చత్రుండ్ సమీపంలోడ్రైవర్ వాహనంపై పట్టుకోల్పోవడంతో లోయలోకి పడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డ్రైవర్ సహా ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మతపరమైన వేడుకకు హాజరై.. తిరిగి సొంతూరికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో మరణించినవారి వివరాలు ఇంకా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి..

Next Story