కేటీఆర్‌పై ఎంపీ రమేష్ సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2025-07-26 09:33:10  IST  )

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ ఎంపీ.. సీఎమ్ రమేష్ పై కీలక ఆరోపణలు చేశారు.

కేటీఆర్‌పై ఎంపీ రమేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR..).. బీజేపీ ఎంపీ సీఎమ్ రమేష్ (Ramesh) పై కీలక ఆరోపణలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్(BJP MP CM Ramesh) ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు తనఖాకు సహాయం చేసినందుకు సీఎం రమేష్‌కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధం అన్నారు. కేంద్ర సాధికారత కమిటీ రిపోర్టు పై ఇప్పటి వరకు బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకు మౌనంగా ఉందో తెలపాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కెటీఆర్ ఆరోపణలపై ఎంపీ రమేష్ ఈ రోజు ఓ మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. కంచ గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో నాకు ఎటువంటి టెండర్లు రాలేదు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం.. రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఎవరితోనైనా దోస్తానా చేస్తే టెండర్లు ఇస్తారా అని ఎంపీ రమేష్ కేటీఆర్‌ను ప్రశ్నించారు.

అలాగే కేటీఆర్ కవిత సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని తన ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. వారిపై వివిధ వ్యవహారాల్లో విచారణలు జరగకుండా చూడాలని కేటీఆర్ అడగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై విచారణలు జరగకుండా చేస్తే.. పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని తనతో చెప్పింది నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు. కేటీఆర్, కవిత సహా బీఆర్ఎస్ నేతలు తన ఇంటికి వచ్చి అడిగినందుకే బీజేపీ పెద్దలతో మాట్లాడానని, బీఆర్ఎస్ పతనం అయిన పార్టీ కావడంతో.. పార్టీలో కలుపుకునేది లేదని బీజేపీ చెప్పిందని ఎంపీ రమేష్ సంచలన విషయాలను చెప్పాడు. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒప్పుకొలేదని కక్షగట్టి.. కేటీఆర్ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి చేసినవన్నీ తనకు తెలుసని, మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో, ఏం చేశారో కూడా తెలుసని తన వద్ద అన్ని ఆదారాలు ఉన్నాయని, వాటిని సీబీఐ, ఈడీకి ఇస్తానని ఎంపీ రమేష్.. కేటీఆర్‌ను హెచ్చరించారు.

Read More..

KTR: పార్టీలో నెం.2 ఇమేజ్ కోసం కేటీఆర్ ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు!

Next Story