KTR: పార్టీలో నెం.2 ఇమేజ్ కోసం కేటీఆర్ ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు!

by Prasad Jukanti |   (  Updated:2025-07-26 09:11:42  IST  )

కేటీఆర్ తన బ్రాండింగ్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం హాట్ హాట్ టాపిక్ గా మారింది.

KTR: పార్టీలో నెం.2 ఇమేజ్ కోసం కేటీఆర్ ఏకంగా  రూ.600 కోట్లు ఖర్చు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుబంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణాలు సంచలనంగా మారుతున్నాయి. పార్టీలో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు గులాబీ పార్టీని అయోమయానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్లుగా వ్యవహారం సాగుతున్నది. దీంతో బల నిరూపణ కోసం ఒకరిని మించి మరొకరు పోటీ పడుతుండడమే ఉదాహరణ. ఈ క్రమంలో కేటీఆర్ (KTR) తన బ్రాండ్ కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాఫిక్ అవుతున్నది.

బ్రాండింగ్ కోసం రూ.650 కోట్లు :

రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోయాక కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీతోపాటు ప్రజాక్షేత్రంలోకి సైతం రావడం లేదు. దీంతో కేసీఆర్ తర్వాత పార్టీలో ఎవరు అనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసేది నేనే అని చెప్పుకునేందుకు తన బ్రాండింగ్ కోసం కేటీఆర్ రూ. 650 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇతర రాష్ట్రాలు, విదేశీ పర్యటనల వెనుక కారణం ఇదేనని, జూన్ 2న ఇక్కడ నిర్వహించాల్సిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విదేశాల్లో నిర్వహించడం వెనుక మతలబు అదేనని అద్దంకి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను తాను ఎక్స్ పోజ్ చేసుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఈ డబ్బుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలపై భారీ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీ నేతలకు టాస్క్‌లు!పార్టీలో నెం.2 ఇమేజ్ కోసం ఏకంగా కేటీఆర్ రూ.600 కోట్లు ఖర్చు!:

కేటీఆర్ బ్రాండింగ్ కోసం పార్టీలోని నేతలకు టాస్క్‌లు సైతం ఇస్తున్నారనే ప్రచారం ఇప్పుడు మరింత చర్చనీయాశంగా మారింది. కేటీఆర్ ప్రారంభించిన "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమం ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రెండు రోజుల క్రితం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో సుమారు 5 వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ఇదంతా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా ఇదే పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేశారు. అయితే కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చేస్తున్న ఈ కార్యక్రమాల వెనుక బీఆర్ఎస్ నేతలకు టాస్క్‌లు ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలోని మిగతా అగ్రనేతల పుట్టిన రోజులకు లేనటువంటి కార్యక్రమాలు కేవలం కేటీఆర్ ఎలివేషన్స్ కోసం పాకులాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read More..

Kalvakuntla Kavitha: కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి.. ఎమ్మెల్సీ కవిత ప్రకటన

Next Story