చివరకు నేను చెప్పిందే నిజమైంది.. ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-12-07 10:33:47  IST  )

చివరకు నేను చెప్పిందే నిజమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చివరకు నేను చెప్పిందే నిజమైంది.. ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల హామీలు అమలు చేయగలరా? అని అడిగితే ఈటల రాజేందర్ కు ఏం తెలియదు అన్నారు.. చివరకు నేను చెప్పిందే నిజమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కమలాపూర్ మండలం శంభునిపల్లి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మీరు నన్ను కోసిన నేనేమీ ఇవ్వలేను.. మనల్ని చూస్తే దొంగ లాగానే చూస్తున్నారు.. అంతలా దివాలా తీసింది రాష్ట్రం అని సీఎం వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎన్నికల ముందు హామీ ఇస్తున్నప్పుడు.. మీరు నాలుగేళ్లు అసెంబ్లీలో కొట్లాడారు, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని చెప్పారు ఇన్ని హామీలు అమలు చేయగలరా అని అడిగితే ఈటల రాజేందర్ కు ఏం తెలియదు అన్నారని చెప్పుకొచ్చారు. సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టాలంటే తలప్రాణం తోకకు వస్తుందని, నేను స్వయంగా వెళ్లి నిలబడమన్నా కూడా ఉన్న కొంత మంది భూమి, పుస్తెలు కూడా అమ్ముకోమంటారా..? అని ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సర్పంచులు వీడియోలు తీసి పెడుతున్నారు.. మాలాంటి కష్టం మీకు రాకూడదని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులు ఇస్తుందని, ఉపాధి హామీ పనులు కింద వచ్చిన డబ్బులతో సిమెంట్ రోడ్లు, మోరీలు కడుతున్నారని తెలిపారు. అంగన్వాడి సెంటర్‌లో ఇచ్చే డైట్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని వెల్లడించారు. ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేశాడు అని మాట్లాడుతున్నారు.. వర్షం పడితే శంభునిపల్లి వాగు, కమలాపూర్ మత్తడి దగ్గర ఉన్న వాగు, అంబాల వాగు దాటనిచ్చేవా.. అని ప్రశ్నించారు.కరీంనగర్ నుండి వరంగల్‌కు హైవే లేదు కానీ నా జమ్మికుంట నుండి హుజూరాబాద్‌కు... హుజురాబాద్ నుండి పరకాలకు ఫోర్ వే లైన్ ఉన్నాయన్నారు.

మీరు ఇచ్చిన శక్తితో నేను మల్కాజిగిరిలో గెలిచాను.. ఇది నన్ను కన్న గడ్డ.. ఒకటి మాతృభూమి ఇంకోటి కర్మభూమి.. తెలంగాణలో ఎక్కడ ఆపద వచ్చినా, రైతుబంధు, పెన్షన్ల కోసం, ఇల్లు కూలగొడితే కొట్లాడేది నేనే.. మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఊరిలో సర్పంచ్ అభ్యర్థి అయిన అర్వపల్లి మంజుల సామ్రాజ్యం ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

READ MORE ....

ఈటల రాజేందర్‌పై BRS MLA సంచలన ఆరోపణలు

Next Story