- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల రాజేందర్‌పై BRS MLA సంచలన ఆరోపణలు
ఈటల రాజేందర్‌పై BRS MLA సంచలన ఆరోపణలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) జోస్యం చెప్పారు. ఇది మూడేళ్లలో మనం చూస్తామని అన్నారు. ఆదివారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar)ది మోసపూరిత చరిత్ర అని ఆరోపించారు. కేసీఆర్‌నే వెన్నుపోటు పొడవాలని చూశాడని మండిపడ్డారు. చివరకు హుజూరాబాద్ ప్రజలను మోసం చేసి.. గజ్వేల్‌కు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూడా జనం ఛీ కొడితే.. అక్కడి నుంచి మల్కాజిగిరి వెళ్లారని విమర్శించారు. ఇప్పుడు ఎక్కడా దిక్కులేక మళ్లీ కమలాపూర్ వస్తానంటున్నారు.. ఈటల రాజేందర్ లాంటి అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు. ఇలాంటి నేతలను అస్సలు నమ్మొద్దని హితవు పలికారు.
కాగా, నిన్న ఈటల రాజేందర్ కూడా కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓటు అడిగితే.. నిజంగానే చచ్చిపోతాడేమో అని మన ఆడబిడ్డలు కరిగిపోయి ఓట్లు వేస్తే ఈ రెండేళ్లలో ఏం చేశారని పరోక్షంగా కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో వారు చేసింది కేవలం డ్రామా అని తేలిపోయిందన్నారు. తాజాగా ఈటల వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.
READ MORE ....
చివరకు నేను చెప్పిందే నిజమైంది.. ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు






