దసరా తర్వాత యాత్ర చేస్తా.. MLC కవిత కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-10 08:41:18  IST  )

బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) ఆఫీస్‌లో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సమావేశం అయ్యారు.

దసరా తర్వాత యాత్ర చేస్తా.. MLC కవిత కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) ఆఫీస్‌లో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి(Singareni) తెలంగాణకు కొంగు బంగారం.. ప్రకృతి ఇచ్చిన వరం అని అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసని గుర్తుచేశారు. ఇవాళ సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి. నేడు 40 వేల మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారు. ఇప్పటివరకు కేవలం 18 నుంచి 20శాతం వరకు బొగ్గుమాత్రమే వెలికితీశాము. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ కాస్ట్‌ల మైన్స్‌తో పెద్ద, పెద్దవాళ్లకు లాభం జరుగుతుంది. సింగరేణి ఉద్యోగులకు ఇన్ కం ట్యాక్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు.

దీనిపై మోడీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. హెచ్ఎంఎస్ అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని వెల్లడించారు. తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని తెలిపారు. హెచ్ఎంఎస్‌తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామని అన్నారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సరైన వేతనాలు ఇవ్వాలి. ఈ డిమాండ్ల అమలు కోసం దసరా తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి యాత్ర చేస్తామని కవిత కీలక ప్రకటన చేశారు. యాత్ర ద్వారా కార్మికుల్లో భరోసా నింపుతామని అన్నారు. ఓపెన్ కాస్ట్‌ల మూలంగా సింగరేణికి నష్టం జరుగుతుంది. దళారుల చేతులనుంచి సింగరేణిని కాపాడాలి. దాదాపు 200 మంది మహిళలు సింగరేణిలో ఉన్నారని అన్నారు.

Read more : సీఎం కవిత అంటూ నినాదాలు.. వీడియో వైరల్

Next Story