- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కవిత అంటూ నినాదాలు.. వీడియో వైరల్
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు చోటు చేసుకుంటున్నాయనేది నిజమని తేలింది. కవిత, కేటీఆర్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. రాఖీ పండుగ సందర్భంగా అందుకే రాఖీ కట్టలేదనేది హండ్రడె పర్సెంట్ ఫ్యాక్ట్ అంటున్నారు నెటిజన్లు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పటికే బయటపడ్డాయి. కవిత, కేటీఆర్ మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సమయంలో అన్నకు మద్దతుగా ట్వీట్ పెట్టి.. డౌట్ పెంచింది. అయితే నిన్న రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్‌కు రాఖీ కట్టకపోవడంతో.. అన్నాచెల్లెళ్ల మధ్య దూరం ఏర్పడిందనేది హండ్రడె పర్సెంట్ ఫ్యాక్ట్ అంటున్నారు నెటిజన్లు. అంతకు ముందు తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం పరిస్థితిని దిగజార్చగా... ఆ తర్వాత ఓ రాజకీయ నాయకుడిని బీఆర్ఎస్‌లో ఈ లిలిపుట్ పెత్తనమేంది అని విమర్శించడం మరో వివాదానికి తెరలేపింది. పార్టీలో కొందరికి ఎక్స్‌ట్రాలు ఎక్కువ అవుతున్నాయని కామెంట్స్ చేసి.. ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించింది
ఈ క్రమంలో తాజాగా కార్యకర్తలతో జరిగిన ఓ మీటింగ్‌లో సీఎం కవిత అంటూ నినాదాలు వెల్లువెత్తాయి. దీంతో సున్నితంగా అలా అనకూడదని సైగలు చేసి వెళ్లిపోయింది కవిత. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ‘ఎంత మురిసిపోతుందో’, ‘పైకి అలా వద్దని వారించినా లోపల మాత్రం అదే కోరిక ఉంది’, ‘ఏంటి నిజంగా సీఎం అయిపోదామనే’, ‘క్వార్టర్ ఎక్స్‌ట్రా ఇచ్చి ఉంటది’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Read More..
Kalvakuntla Kavitha : బండి సంజయ్‌కి ఈటల వార్నింగ్.. తొలిసారి స్పందించిన కవిత






