ఆ విషయాన్ని బీజేపీ ఇకనైనా గుర్తించాలి.. సుప్రీం తీర్పుపై MLC కవిత ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-13 13:35:23  IST  )

ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకాలను సుప్రీంకోర్టు(Supreme Court) రద్దు చేయడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు.

ఆ విషయాన్ని బీజేపీ ఇకనైనా గుర్తించాలి.. సుప్రీం తీర్పుపై MLC కవిత ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకాలను సుప్రీంకోర్టు(Supreme Court) రద్దు చేయడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని గౌరవించకుంటే పరాభవం తప్పదని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. ఆనాడు గవర్నర్‌‌ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో సిఫార్సు చేసిన ఎమ్మెల్సీల నియామకాలను బీజేపీ కుట్ర పూరితంగా అడ్డుకున్నది. వారి నియామకం పెండింగ్‌లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించింది. వారి శాసన మండలి సభ్యత్వాలు రద్దు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బీజేపీకి చెంపపెట్టు. ఇకనైనా రాజ్యాంగాన్ని గౌరవించి గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలపాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సుప్రీంకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేయాలి’ అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Read More..

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు.. సుప్రీంకోర్టుకు సలాం చేసిన కేటీఆర్

Supreme Court: ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకం రద్దు

Next Story