- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు.. సుప్రీంకోర్టుకు సలాం చేసిన కేటీఆర్
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ నియామకాలపై న్యాయస్థానం స్టే విధించి.. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు. గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More..
ఆ విషయాన్ని బీజేపీ ఇకనైనా గుర్తించాలి.. సుప్రీం తీర్పుపై MLC కవిత ట్వీట్
Supreme Court: ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకం రద్దు






