రాష్ట్రంలో కలకలం రేపుతోన్న కవిత లేఖ.. BRS శ్రేణులకు ఎమ్మెల్సీ దాసోజు కీలక సూచన

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-23 11:17:02  IST  )

కవిత(Kavitha) రాసిన లేఖపై ఇప్పటివరకు స్పష్టత లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Sravan) అన్నారు.

రాష్ట్రంలో కలకలం రేపుతోన్న కవిత లేఖ.. BRS శ్రేణులకు ఎమ్మెల్సీ దాసోజు కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కవిత(Kavitha) రాసిన లేఖపై ఇప్పటివరకు స్పష్టత లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Sravan) అన్నారు. శుక్రవారం దాసోజు మీడియాతో మాట్లాడారు. ఆ లేఖను ఇంకా కవిత, పార్టీ అధిష్టానం నిర్ధారించలేదని చెప్పారు. ఒకవేళ కవిత లేఖ రాసినా పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీలో ఫీడ్‌బ్యాక్‌ను ప్రజాజీవితంలో ఉన్న కూతురు.. బాధ్యతగా తండ్రికి వివరించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏముందని అన్నారు. ముందు తన సీటు ఉంటుందో లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సోషల్ మీడియా టీమ్ ద్వారా లీకులు ఇస్తూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్(KCR) తప్పకుండా మళ్లీ బయటకు వస్తారని.. వచ్చినప్పుడు ఎవరి వాటా వారికి తప్పకుండా చెల్లిస్తారని అన్నారు. రాష్ట్రంలో మన పార్టీ అంత స్ట్రాంగ్‌గా ఏ పార్టీ లేదని.. అది చూసి ఓర్వలేక చిచ్చు పెడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

Also Read: మీడియా ముందుకు MLC కవిత.. ఏం మాట్లాడుతారో అని సర్వత్రా ఉత్కంఠ!

Next Story