- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీడియా ముందుకు MLC కవిత.. ఏం మాట్లాడుతారో అని సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) లేఖ సంచలనంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) లేఖ సంచలనంగా మారింది. వరంగల్ వేదికగా బీఆర్ఎస్(BRS) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ లోటుపాట్ల వివరిస్తూ తండ్రి కేసీఆర్(KCR)కు ఆరు పేజీల కవిత లేఖ రాశారు. అయితే.. ఈ లేఖపై ఇటు కవిత గానీ, ఇటు పార్టీ అధిష్టానం గానీ స్పందించలేదు.. నిర్ధారించలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కవిత సాయంత్రం మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళిన కవిత ఇవాళ తిరిగి వస్తున్నారు. శుక్రవారం రాత్రి 7: 30 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతారని సమాచారం. దీంతో కవిత ఏం మాట్లాడబోతున్నారో అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అధికార కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు.. ఈ ఇష్యూపై ఇవాళ కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao)లను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మాట్లాడేందుకు వారు నిరాకరించారు. ఓ ప్రోగ్రామ్‌కు అటెండైన కేటీఆర్‌ను ఓ జర్నలిస్ట్.. కవిత ప్రస్తావన తీసుకొచ్చి ప్రశ్నించింది. మాకు లేని హడావుడి మీకెందుకంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అలాగే మరో మీడియా ప్రతినిధి మాజీ మంత్రి హరీశ్‌ను కూడా కవిత లెటర్ గురించి అడుగగా అందుకు ఆయన మాట్లాడకుండానే హడావుడిగా కారు ఎక్కి వెళ్లిపోయారు. మరోవైపు లేఖపై కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నారు. దీంతో కేడర్‌లో కన్‌ఫ్యూజన్ నెలకొంది. కవిత ఇచ్చే క్లారిటీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
Also Read: రాష్ట్రంలో కలకలం రేపుతోన్న కవిత లేఖ.. BRS శ్రేణులకు ఎమ్మెల్సీ దాసోజు కీలక సూచన






