హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్‌ను చెప్పారు : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్

by Ramesh Naini |   (  Updated:2026-02-02 15:49:30  IST  )

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు.

హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్‌ను చెప్పారు : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. విద్యకు, క్రీడలకు ప్రాధాన్యమిచ్చే రేవంత్ రెడ్డి విద్యార్థులకు, యువతకు ఆదర్శమని, ఏ వయసులోనైనా కొత్తది నేర్చుకోవాలి, చదువుకోవాలంటూ హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా సీఎం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దానిపై కూడా హేళనగా మాట్లాడటం, కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. సోమవారం మీడియాతో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్‌ను చెప్పి.. అక్కడి మన విద్యార్థులను ఆకట్టుకున్నారని, పదేళ్ల మీరు విదేశాల్లో తిరిగి ఒరగబెట్టింది ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.

సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్‌ను పిలిస్తే తెలంగాణ అస్థిత్వాన్ని ముట్టినట్లు అని మాట్లాడిన కేటీఆర్, పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసి, రాష్ట్రాని దివాళా తీయించిన రాబందులు మీరు కాదా అని బల్మూర్ వెంకట్ నిలదీశారు. తెలంగాణలోని విద్యార్థులకు, యువతకు స్ఫూర్తి నిచ్చేలా సీఎం కార్యక్రమాలు చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన ఫైర్ అయ్యారు. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలు మీకు మరోసారి సరైన గుణపాఠం చెబుతారని ఆయన మండిపడ్డారు.

Read More.. హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్‌ను చెప్పారు : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్

Next Story