Balmuri Venkat: 3 సార్లు కాదు 300 సార్లు పిలిచినా వెళ్లాల్సిందే.. కేటీఆర్ కు బల్మూరి వెంకట్ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-06-16 06:36:45  IST  )

కేటీఆర్ కు బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు.

Balmuri Venkat: 3 సార్లు కాదు 300 సార్లు పిలిచినా వెళ్లాల్సిందే.. కేటీఆర్ కు బల్మూరి వెంకట్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో (Formula E car race case) అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) ధ్వజమెత్తారు. కేటీఆర్ (KTR) కు చిత్తశుద్ధి ఉంటే ఏసీబీ విచారణలో నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నారు. ఇవాళ ఏసీబీ (ACB) విచారణకు కేటీఆర్ హాజరయ్యే ముందు తనను ఇప్పటికే మూడు సార్లు విచారణకు పిలిచారని 30 సార్లు పిలినిచినా విచారణకు వస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై బల్మూరి వెంకట్ రియాక్ట్ అయ్యారు. అవసరం అయితే అధికారులు 3 సార్లు కాదు 300 సార్లు అయినా పిలుస్తారనని విచారణకు హాజరై వాస్తవాలు చెప్పాల్సిందేనన్నారు. ఈ మేరకు బల్మూరి వెంకట్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు.. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా అడ్డంగా దొరికిపోవడమే కాకుండా కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీపై అక్రమంగా కేసులు బనాయించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ఇవాళ మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ తాను అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డితో పాటు మా అందరిపై అడ్డగోలుగా వందలాది కేసులు బనాయించి అక్రమంగా నెలల జైల్లో పెట్టించారని మరి దాన్ని పైశాచిక ఆనందం అనాలా లేక శాడిజం అనాలా అని ప్రశ్నించారు. కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కోరిక ఉందని.. కేటీఆర్ చేసిన ప్రతి స్కామ్ లో ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు. కేటీఆర్ ను సొంత కుటుంబ సభ్యులే దయ్యం అని అంటున్నారు. ఇకనైనా కేటీఆర్ ఆ డ్రామాలు ఆపి విచారణకు సహకరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి ఉండదన్నారు.

Phone Tapping Case: సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్న టీపీసీసీ చీఫ్

‘నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది’.. ఏసీబీ విచారణ వేళ KTR హాట్ కామెంట్స్

Next Story