Phone Tapping Case: సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్న టీపీసీసీ చీఫ్

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Phone Tapping Case: సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్న టీపీసీసీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సాక్షిగా మారబోతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా, నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌ను సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల(Jubilee Hills Police) సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు.

Next Story