- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి తీవ్ర జ్వరం.. ఇంట్లోనే కొనసాగుతోన్న చికిత్స
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి ప్రస్తుతం తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

దిశ, వెబ్‌డెక్క్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Venkataramana Reddy) ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు, మూడు రోజులగా రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యే ప్రస్తుతం పోలీసుల బందోబస్తు మధ్య గృహ నిర్బంధంలో ఉండగా.. వైద్యులను నేరుగా ఆయన నివాసానికే పిలిపించి ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బ్లెడ్ శాంపిల్స్‌ను సేకరించి, పరీక్షలకు పంపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేకు ఇంటి వద్దే మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని రోజులు ఎమ్మెల్యేకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
కాగా, ఇటీవల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.






