నాపై అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. షబ్బీర్ అలీకి వెంకటరమణారెడ్డి ఛాలెంజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-23 08:19:15  IST  )

డిగ్రీ కళాశాల భూముల విషయంలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీకి సంచలన సవాల్ విసిరారు.

నాపై అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. షబ్బీర్ అలీకి వెంకటరమణారెడ్డి ఛాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ కళాశాల భూముల అంశంలో తాను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని షబ్బీర్ అలీ (Shabbir Ali)కి వెంకటరమణారెడ్డి (Venkataramana Reddy) సవాల్ విసిరారు. ఇవాళ డిగ్రీ కళాశాల భూముల వివరాలు ఇవ్వాలని, వాస్తవాలను బయటపెట్టాలని ఆయన కామారెడ్డి కలెక్టర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ ఈ అంశంలో ప్రజలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ సత్యదూరమైన అంశాలను వాడుకుంటోందని మండిపడ్డారు. డిగ్రీ కళాశాల భూముల వివరాలను ఆర్టీఐ (RTI) ద్వారా కోరామని, ప్రభుత్వం నుండి సమాచారం అడిగామని వెల్లడించారు. కాలేజీ భూముల విషయంలో తాను ఒక్క గజం అవినీతి చేసినట్లు నిరూపించినా పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కామారెడ్డిలో శాంతి భద్రతల (Law and Order) సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో సహనంతో ఉన్నానని అన్నారు. తనను కలవడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, మరి కాంగ్రెస్ నాయకులను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాలేజీ భూముల విషయంలో త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి తీవ్ర జ్వరం.. ఇంట్లోనే కొనసాగుతోన్న చికిత్స

Next Story