నాంపల్లిలో టెన్షన్.. కోర్టుకు MLA Raja Singh

by Disha Web Desk 4 |
నాంపల్లిలో టెన్షన్.. కోర్టుకు MLA Raja Singh
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని బొల్లారం పీఎస్‌కు తరలించారు. బొల్లారం పీఎస్‌ నుంచి పోలీసులు భారీ భద్రత నడుమ రాజాసింగ్‌ను కోర్టుకు తరలిస్తున్నారు. ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా రాజాసింగ్‌పై కేసులు నమోదయ్యాయి.

మంగళ్‌హట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్దకు రాజాసింగ్ అభిమానులు చేరుకోవడంతో, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఎటువంటి ఆందోళనలు జరగకుండా కోర్టు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, నాంపల్లి కోర్టు రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాజాసింగ్ ఇంతకు ముందు మాట్లాడుతూ, తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయనే విషయం తనకు తెలుసని.. కానీ, ధర్మం కోసం తాను ఇలాగే మాట్లాడతానని చెప్పారు. చావుకు సైతం తాను సిద్ధమేనని అన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి, పార్టీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది.

'రాజాసింగ్ సస్పెన్షన్ ఓ డ్రామా.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన హిందూ, ముస్లిం వర్గాలు



Next Story

Most Viewed