Miss World: మరో ముద్దుగుమ్మ ఆగమనం! మిస్ పోర్చుగల్‌‌కు ఘన స్వాగతం

by Ramesh Naini |   (  Updated:2025-05-05 06:55:08  IST  )

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

Miss World: మరో ముద్దుగుమ్మ ఆగమనం! మిస్ పోర్చుగల్‌‌కు ఘన స్వాగతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న (Miss World 2025) మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ఈవెంట్ జరగనుండటంతో ప్రపంచ దేశాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా అడుగుపెడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశాల బ్యూటీలు భాగ్య‌న‌రంలో వాలిపోయారు. తాజాగా మిస్ పోర్చుగల్ (Ms. Maria Amelia Baptista Antonio) అమేలియా బాప్టిస్టా ఆంటోనియో హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో అధికారులు స్వాగతం పలికారు.

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శంషాబాద్ ఎయిర్ పోర్టు

ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు (Hyderabad) హైదరాబాద్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా 150 పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ పోటీల ద్వారా తెలంగాణ క‌ల్చ‌ర్‌ను ఇతర దేశాలకు తెలిసేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక శాఖ దీనికోసం ఏర్పాట్లు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సర్వాంగ సుందరంగా హైదరాబాద్ ముస్తాబవుతోంది. వందకుపైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు (Shamshabad Airport) శంషాబాద్ ఎయిర్ పోర్టును అధికారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు ప్రపంచ అందగత్తెలను సొంత రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్, నటి మంచు లక్ష్మి స్పెషల్ వీడియో షేర్ చేసి పంచుకున్నారు. అందం, సంస్కృతి, ఐక్యత కలిసే ఈ వేడుకల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలంగాణ టూరిజం, ప్రభుత్వానికి వారు స్పెషల్ విషెస్ తెలియజేశారు.

Click For Link..


Read More..

Miss World: హైదరాబాద్‌‌‌కు తరలివస్తున్న అందగత్తెలు.. మిస్ బ్రెజిల్‌కు ఘన స్వాగతం

Next Story